Ration Cards e-KYC (Credits: X)

Hyderabad, JAN 26: రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి కోసం దరఖాస్తు ఫామ్‌ను విడుదల చేశారు. ఈ ఫాం మీసేవా పోర్టల్‌లో అందుబాటులో ఉంది. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు (How To Apply Ration Card) చేసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు ఫామ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు. ప్రభుత్వం డేటును ప్రకటించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం (New Ration Card) ఆన్‌లైన్‌లో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను చూద్దాం.

తెలంగాణ ఆహార, పౌర, వినియోగదారుల విభాగం రేషన్ కార్డులను ఇవ్వనుంది. ప్రస్తుతం దరఖాస్తులు ఆఫ్‌లైన్‌ విధానంలో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. అధికారిక వెబ్‌సైట్‌ https://meeseva.telangana.gov.in/ ఆన్‌లైన్‌లోనే రేషన్‌కార్డు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CM Revanth Reddy: నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి... అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అవుతాయన్న రేవంత్ 

కుటుంబ సభ్యుడి పేరును రేషన్‌ కార్డులో కలపాలనుకున్నా, పేరును తొలగించాలనుకున్నా, రేషన్ కార్డులో దిద్దుబాటు చేయాలనుకున్నా కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు దరఖాస్తును నింపి, సంబంధిత విభాగానికి లేదా దాని అధికారిక వెబ్‌సైట్‌లో (త్వరలో) ఆన్‌లైన్‌లో సమర్పించాలి. లేదంటే మీసేవా కేంద్రంలో రుసుము చెల్లించి రేషన్ కార్డ్ ఫామ్‌ను ఇవ్వండి.

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి 

రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యాన్ని కూడా అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రేషన్ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలను పొందడానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకునే అవకాశం ఉంది. రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి నెల బియ్యంతో పాటు గోధుమలు మొదలైన ఆహార ధాన్యాలను ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తుంది. రేషన్ కార్డుల్లో తెల్ల రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు , అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉంటాయి.

రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, వార్షిక ఆదాయ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, జన్మదిన ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబర్, మీ చిరునామా వంటివి పొందుపర్చాలి. రేషన్‌ కార్డును దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్టేటస్‌ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్‌ చేసి అడిగిన వివరాలు పొందుపర్చాలి.