Restrictions On New Year Celebrations: హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు.. జైలుకు కూడా పంపించొచ్చు.. జాగ్రత్త మరి..!!
న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సిటీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు.
Hyderabad, Dec 13: న్యూఇయర్ వేడుకలకు (New Year Celebrations) హైదరాబాద్ (Hyderabad) ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సిటీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కొన్ని ఆంక్షలు (Restrictions) విధించారు. రాత్రి 10 గంటల తర్వాత ఔట్ డోర్ లౌడ్ స్పీకర్లను నిషేధించారు. పబ్బులు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరించారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలను నిషేధించారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక
ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి
వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం
ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్
పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరణ
డ్రగ్స్… pic.twitter.com/SAPA3lRUUo
— BIG TV Breaking News (@bigtvtelugu) December 13, 2024
అలా అయితే జైలుకే..!
మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే వారికి అనుమతి తప్పనిసరి అని గుర్తుచేశారు. ఈవెంట్ల నిర్వాహకులు 15 రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
(The above story first appeared on LatestLY on Dec 13, 2024 10:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

