Hyderabad, June 26: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో ఓ ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై ఉరివేసుకుని ఆత్మహత్యకు (12-years-boy-committed-suicide) పాల్పడ్డాడు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగీత్ నగర్‌లో నివసించే ఆనంద్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో మణికంఠ (12) ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
ఇంట్లో తల్లిదండ్రులు, అన్నయ్య ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఈరోజు ఇంట్లో ఎవరూలేని సమయంలో మణికంఠ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.
మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ వద్ద ఉన్న మొబైల్‌లో వీడియోగేమ్ ఓపెన్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీడియోగేమ్‌లు (playing Online Video Games) చూస్తూ .. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే ఫోన్‌లో గేమ్ ఆడుతుండగా, ఆట మధ్యలో తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారని. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.