Sonu Sood (photo credit: Instagram)

Hyderabad, July 28: సోనూ సూద్.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు దేశంలో కూడా వెబ్రేషన్ అవుతోంది. తన స్థాయికి మించి ఈ నటుడు పేద ప్రజలకు చేస్తున్న సాయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మరోసారి సోనూ సూద్ ప్రజల మనసును గెలుచుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన టెకీ శారదకు (Hyderabad Techie) తన వంతు సహాయం చేస్తానని నటుడు సోనూసూద్‌ (Actor Sonu Sood) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సోనూసూద్ సాయం వెనుక కథ ఏంటి? ట్రాక్టర్ తీసుకున్న రైతు ఏమంటున్నారు, సోనూసూద్ గొప్ప మనసుపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం

ఈ నేపథ్యంలో సోమవారం తన ప్రతినిధి ఆమెకు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ (Gets Offer Letter) అందించినట్లు సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ వెల్లడించారు. ట్విట్టర్లో సోనూ ‘మా ప్రతినిధి తనను కలిశారు. ఇంటర్వ్యూ పూర్తైంది. జాబ్‌ లెటర్‌ కూడా పంపించాం. జై హింద్‌’’అని అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా కరోనా లాక్‌డౌన్‌ (nationwide lockdown) కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శారద కూరగాయల వ్యాపారం (Selling Vegetables) చేస్తూ కుటుంబానికి అండగా నిలబడింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా సోనూసూద్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. తన ప్రతినిధి ద్వారా ఆఫర్ లెటర్ అందించారు.

Here's Sone Sood Tweet

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో వారందరి కోసం సోనూ సూద్‌ ఓ కొత్త యాప్‌ను తయారు చేయించిన విషయం విదితమే. ఈ యాప్‌ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు.