I am congress soldier..No gap with Rahul Gandhi says CM Revanth Reddy(X)

Hyd, Feb 16: తాను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో(Rahul Gandhi) భేటీ అయిన రేవంత్.. రాహుల్‌తో ఎలాంటి గ్యాప్ లేదని వెల్లడించారు. అయితే నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు కానీ నా పని నేను చేస్తున్నాను అన్నారు.

నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను.. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను, అమలు చెయ్యక పోతే అడిగేది నన్నే అన్నారు(Revanth Reddy meets Rahul Gandhi). కొంతమంది నాపై అబద్ధపు ప్రచారాలు చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారు.. కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలను నేను పట్టించుకోను అన్నారు.

 రాహుల్ గాంధీ తాత ముస్లిం..అమ్మ క్రిస్టియన్..మోడీ బీసీ కాదన్న కామెంట్స్‌పై బీజేపీ, రాహుల్ గాంధీది బలహీన వర్గాల కులం అని కాంగ్రెస్ నేతల క్లారిటీ 

రాహుల్ గాంధీతో సుమారు గంటపాటు రేవంత్ సమావేశమయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను రాహుల్‌కు వివరించారు రేవంత్. అలాగే వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగసభలకు రావాలని రాహుల్‌ని ఆహ్వానించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై రేవంత్‌కు కీలక సూచన చస్త్రశారు రాహుల్. కొత్తగా నియమితమైన పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అలాగే త్వరలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటం,స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్‌కు వివరించారు. మార్చిలో ఖాళీ కాబోయే ఐదు MLC స్థానాల్లో నాలుగు స్థానాలను కాంగ్రెస్ సాధించే అవకాశముందని రాహుల్‌కు తెలిపారు రేవంత్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగుతున్నామని తెలిపారు. అయితే కేబినెట్ విస్తరణ అంశం ఈ భేటీలో చర్చించలేదు అని తెలిపారు రేవంత్.