KTR Inspects Sewage Treatment Plant at Nacharam(BRS X)

Hyd, Oct 27: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారంలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాచారంలోని పెద్ద చెరువు ఎస్టీపీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపడం రాదు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులను పోలీసులు కొడుతున్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు...ఆరు గ్యారెంటీలను పక్కనబెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోందన్నారు.

మూసీ సుందరీకరణ కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు మూసీకి తీసుకువస్తే పూర్తి అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలు చెబుతూ అవినీతి కోసం కుట్ర చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన లక్షన్నర కోట్ల మాట నేను అంటే, నాపై ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న హామీలను, గ్యారెంటీలను రేవంత్ మరిచిపోయాడని...మూసీ ప్రాజెక్టు వెనుక ఉన్న మూటల గురించి మాట్లాడుతున్నాడు అన్నారు.

మా పార్టీ మూసీకి వ్యతిరేకం కాదు. కానీ మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోం అన్నారు. హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అనుమతులు పొందిన, పన్నులు కట్టే వారి ఇళ్లను కూలగొడుతున్నారు...పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసేదాక, ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేదాక పేద ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడుతుందన్నారు. హైదరాబాద్ నగర ప్రజల కోసం మా పార్టీ అండగా ఉంటుంది...మీ ఇంటి పైకి బుల్ డోజర్లు వస్తే, నాతో సహా పార్టీ నాయకులందరూ ముందు పడతారు అన్నారు.

హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్‌కి ఓటు వేయలేరన్న కక్షతోనే రేవంత్ రెడ్డి ఈ విధ్వంసం చేస్తున్నారు అన్నారు. పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి షాపింగ్ మాల్స్ కట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు..10 సంవత్సరాల మా ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసుకున్నాం అన్నారు.

24 గంటల విద్యుత్తు నిరంతరంగా సరఫరా చేయడంతో పాటు తాగునీటి కోసం కష్టాలు లేకుండా చేశాం...హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేల అన్ని రంగాల్లో అభివృద్ధిని చేపట్టాం అన్నారు. హైదరాబాద్ నగర మూరికినీటి శుద్ధికరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం...మూసీ నదిలో మూరికినీటి రాకుండా ఎస్టిపిల నిర్మాణం చేపట్టాం అని తెలిపారు. తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..! 

3866 కోట్ల రూపాయలతో ఎస్టిపిల నిర్మాణం మనం చేపడితే, మొన్న ముఖ్యమంత్రి వచ్చి ఉప్పల్లో ప్లాంట్ ప్రారంభించారు...మూసీ పునరజీవనం అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ 4000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేసిందన్నారు. దీంతో పాటు కొండపోచమ్మ సాగర్ నుంచి నగర జంట జలాశయాలకు నీరు తీసుకువచ్చి, మూసీలో స్వచ్ఛమైన తాగునీరు పోసేందుకు గత ప్రభుత్వమే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందన్నారు. మూసీపై ఇప్పటికే బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా గత ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. ఉప్పల్, నాచారం వంటిచోట్ల మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం అన్నారు.