Hyd, Dec 12: మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ..కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మాదిగలకు పలుకుబడి లేదు అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని మాదిగలు ఉర్రూతలూగించారు..కళాకారుల గుర్తింపులో మాదిగ కళాకారులు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే ఎక్కా యాదగిరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, మహిళలను రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారులుగా గుర్తించలేదు అని మండిపడ్డారు మందకృష్ణ.9 మంది ప్రముఖుల్లో మాదిగలు, మహిళలను ఎందుకు గుర్తించలేదు, వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్ అన్నారు.
ప్రముఖులుగా కొంతమందినే గుర్తించడమంటే..మిగతావాళ్లను అవమానించడమే,తెలంగాణ ఉద్యమంలో మాదిగలు అగ్రభాగాన నిలిచారు అన్నారు. ప్రముఖుల గుర్తింపులో రేవంత్ సర్కార్ మహిళలకు ద్రోహం చేసింది...చాకలి ఐలమ్మ, టిఎన్ సదాలక్ష్మి, విమలక్క వంటి వాళ్లను ఎందుకు ప్రముఖులుగా గుర్తించలేదు,రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడానికి అవసరం ఏంటి..? అని ప్రశ్నించారు.
ఏకకాలంలో సోనియాగాంధీ కుటుంబంలో ముగ్గురు చట్టసభల్లో ఉన్నారు...కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో మాలలను కుటుంబంలోని ముగ్గురిని చట్టసభలకు పంపిందన్నారు. మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ చట్టసభలకు పంపింది...వివేక్ కుటుంబానికి చెందిన ముగ్గురిని చట్టసభలకు పంపింది...మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి అన్యాయమే చేస్తుందన్నారు..సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు
మాదిగ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ అపాయిట్ మెంట్ ఇవ్వదు...మల్లు రవి, భట్టి విక్రమార్కకు ఎలా అపాయింట్ మెంట్ ఎలా దొరుకుతుంది చెప్పాలన్నారు. మాదిగ కవులు, కళాకారులను ఉద్యమకారులుగా ప్రభుత్వం ఎందుకు గుర్తించదు,రసమయి, గిద్దె రాంనర్సయ్య, ఏపూరి వంటి కళాకారులు ప్రభుత్వానికి గుర్తుకురాలేదా? చెప్పాలన్నారు.