Manda Krishna Madiga Praises CM Revanth Reddy(CMO)

Hyd, Feb 12:  రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ(Manda Krishna Madiga), మాదిగ ఉపకులాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌తో సమావేశమయ్యారు.

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ(Madiga Reservations)కు ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కావొద్దన్న ఆలోచనతో ప్రక్రియను చట్టబద్దంగా ముందుకు తీసుకువెళ్లామని, అందులో భాగంగానే తొలుత అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీని నియమించడంతో పాటు న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని వివరించారు.

ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సాధ్యమైనంత తొందరగా సదరు నివేదికలను తెప్పించి, కమిషన్ సిఫార్సులను కేబినెట్‌లో, ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించామని సీఎం గుర్తుచేశారు.

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని మంద కృష్ణ(Mandakrishna Madiga praises CM Revanth Reddy) అభినందించారు.

వర్గీకరణ ప్రక్రియను ఒక నిబద్ధతతో చేపట్టిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మందకృష్ణ తెలిపారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.