bandi Sanjay (Photo-Twitter)

Hyd, April 26: లక్షా 90వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ నిరుద్యోగ యువతను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని మల్లికార్జున చౌరస్తా నుంచి గడియారం కూడలి వరకు నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్‌ మాట్లాడుతూ...ఓవైసీ కళ్లలో ఆనందం చూడటానికే సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని కడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం రూపు రేఖలు మారుస్తామన్నారు. ఇక్కడి నల్ల పోచమ్మ గుడిని కూల్చేసి కేవలం రెండున్నర కుంటలు ఇచ్చారని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ఇక్కడి నల్ల పోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంలా మారుస్తామన్నారు.

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక, మరో మూడు రోజుల పాటు గాలివానలు, ఎవరూ బయటకు రావొద్దని ఐఎండీ ఆదేశాలు

యూపీలోని అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ పెద్ద గ్యాంగ్ స్టర్ అని వ్యాఖ్యానించారు. నయీమ్ ను చంపిన గ్యాంగ్ స్టర్ కేసీఆరే అని ఆరోపించారు.పేపర్ లీకేజీ నిర్వాకం పెద్దలదే అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విచారణను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీకి ఇద్దరు కారణమని కేటీఆర్ చెప్పారని, కానీ 50 మందిని ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు.

తాను నిరుద్యోగుల కోసం పోరాడితే జైలుకు పంపించారన్నారు. నష్టపోయిన నిరుద్యోగులకు రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని వ్యక్తి సీఎంగా ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణను ఎవరి కోసం సంపాదించుకున్నాం... కేసీఆర్ కుటుంబం కోసమా...! అని ఆవేదన వ్యక్తం చేశారు. మియాపూర్ భూముల సిట్ నివేదిక ఏమైందన్నారు. అన్ని తప్పులకు బండి సంజయ్ కారణమైతే ఇక సీఎంగా కేసీఆర్ ఎందుకన్నారు.

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. కొట్టుకుపోయిన హుస్సేన్‌సాగర్‌లోని భాగమతి బోటు.. 40 మంది ప్రయాణికులు సురక్షితం

30లక్షల మంది నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని వ్యక్తి సీఎంగా ఎందుకని ప్రశ్నించారు. కావాలనే తప్పులతడగా నోటిఫికేషన్లు ఇచ్చారని, కోర్టుకు వెళ్లి వాటిని ఆపించారని ఆరోపించారు. అన్ని తప్పులకు బండి సంజయ్‌ కారణమైతే సీఎంగా కేసీఆర్‌ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

ఎవరి కోసం తెలంగాణ సాధించుకున్నాం?కేసీఆర్‌ కుటుంబం కోసమా తెలంగాణ సాధించుకుంది. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని తెలంగాణ సాధించుకున్నాం. 317 జీవోకు వ్యతిరేకంగా భాజపా పోరాడింది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాను గెలిపించారు. లీకేజీకి ఇద్దరు మాత్రమే కారణమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. లీకేజీకి ఇద్దరు మాత్రమే కారణమైతే 50మందిని ఎందుకు అరెస్టు చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై సిట్‌ దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం లేదు. మియాపూర్‌ భూముల సిట్‌ నివేదిక ఏమైంది? నయీం ముఠా అరాచకాలపై వేసిన సిట్‌ నివేదిక ఏమైంది? పేపర్ల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. నష్టపోయిన యువతకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే’’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయి అల్లాడుతుంటే పరామర్శించే తీరికలేని మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతినిధుల సభల పేరుతో డిస్కో డ్యాన్సులు చేస్తున్నారన్నారు. రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. ఎకరాకు రూ.20 వేల పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు.

సీఎం కేసీఆర్‌ కుటుంబానికి మదమెక్కిందని.. ప్రధాని మోదీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, భాష మార్చుకోవాలని.. లేకపోతే, ప్రజలు గుణపాఠం చెబు తారని హెచ్చరించారు. సెక్రటేరియట్‌ వద్ద నల్లపోచమ్మ గుడికి రెండున్నర గుంటల భూమి ఇచ్చిన కేసీఆర్‌, అదే ప్రాంగణంలో మసీదుకు 5 గుంటల భూమి ఇచ్చారని.. ఇదేం వివక్ష..? అని సంజయ్‌ ప్రశ్నించారు.