Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

Hyd, Dec 2: ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 24 దేశాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏండ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు రూ. వెయ్యి జ‌రిమానా (Telangana imposes Rs 1000 penalty) విధిస్తార‌ని తేల్చిచెప్పారు. మాస్కు ధ‌రించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరు మాస్క్‌ (wearing face masks) ధరించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. మాస్క్‌ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానాను విధించనున్నట్లు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్‌ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు.. ఎక్కడికి వెళ్లిన వ్యాక్సినేషన్‌ పత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తామన్నారు.

రిస్క్‌ దేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన 325 మంది ప్రయాణికులకు పరీక్షలు చేయడం జరిగిందని.. వీరిలో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని హెల్త్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా, జీనోమ్‌ సిక్వెన్స్‌కి నమునాలు పంపించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజలందరు తప్పకుండా మాస్క్‌ ధరించి, కరోనా నిబంధనలు విధిగా పాటించాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు.

ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ క‌ట్ట‌డిపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా చ‌ర్చించామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలి. త‌ప్ప‌నిస‌రిగా అంద‌రూ కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలి. ఒమిక్రాన్ నివార‌ణ‌కు మ‌న వంతు ప్ర‌య‌త్నం చేయాలి. జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఇప్పుడు జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారాలే వాస్త‌వాల‌వుతాయి. ముప్పు ఎప్పుడైనా వ‌చ్చే అవ‌కాశం ఉంది అని శ్రీనివాస్ రావు హెచ్చ‌రించారు.

నిన్న యూకే, సింగ‌పూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 325 మంది ప్ర‌యాణికులు వ‌చ్చారు. రాష్ట్రానికి చెందిన వారు 239 మంది ఉన్నారు. వీరంద‌రికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేశామ‌న్నారు. ఇందులో యూకే నుంచి ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆమెను త‌క్ష‌ణ‌మే గ‌చ్చిబౌలి టిమ్స్‌కు త‌ర‌లించి ఐసోలేష‌న్‌లో ఉంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఆమె నుంచి శాంపిళ్ల‌ను సేక‌రించి ఫుల్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించాం. మూడు, నాలుగు రోజుల్లో ఆ రిపోర్టు వ‌స్తేనే ఆ వైర‌స్ ఒమిక్రాన్ వేరియంటా? లేక డెల్టా వేరియంటా? అనే విష‌యం తేలుతుంద‌న్నారు.

4 రోజుల్లో 12 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్, పెను ప్ర‌మాదం పొంచి ఉందని తెలిపిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ, డెల్టా క‌న్నా ఆరు రెట్లు ప్ర‌మాదక‌ర‌మ‌ంటున్న నిపుణులు

ఒమిక్రాన్ వేరియంట్.. 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాల‌కు విస్త‌రించింద‌ని శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. మ‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లే మ‌న‌కు శ్రీరామ‌ర‌క్ష అని పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 31వ తేదీలోపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకంటున్నామ‌ని తెలిపారు. మాస్కు ధ‌రించ‌డం, వ్యాక్సిన్ తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవ‌డంతో వైర‌స్‌ను అరిక‌ట్టొచ్చు. ఫంక్ష‌న్స్, పండుగ‌ల్లో జాగ్ర‌త్త‌లు పాటించాలి. క‌రోనా వైర‌స్ పూర్తిగా క‌నుమ‌రుగు కాలేదు. వృద్ధులు, ఇత‌ర రోగాలు ఉన్న వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాణాల‌ను కాపాడుకునే అవ‌కాశం ఉందని అన్నారు.

తెలంగాణ‌లో సుమారు 25 ల‌క్ష‌ల మందికి పైగా సెకండ్ డోసు తీసుకోని వారు ఉన్నారు. 15 ల‌క్ష‌ల మందికి పైగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్నారు. 80 ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. రెండు డోసులు తీసుకోవ‌డం ద్వారానే పూర్తి ర‌క్ష‌ణ ల‌భించే అవ‌కాశం ఉంద‌న్నారు. మాస్కులే వ్యాక్సిన్‌లా ప‌ని చేస్తాయి. మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. 1000 జ‌రిమానా పోలీసులు విధిస్తారు. సామాజిక బాధ్య‌త‌గా వ‌చ్చే రెండు, మూడు నెల‌లు మాస్కు ధ‌రిస్తే థ‌ర్డ్ వేవ్‌ను అరిక‌ట్టే అవ‌కాశం ఉంది. అన్ని ర‌కాల ప‌ని ప్ర‌దేశాల్లో, ప్ర‌యాణికులు కూడా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రిగా ఉంచుకోవాలి అని శ్రీనివాస్ రావు సూచించారు.