COVID in TS: తెలంగాణలో 1 లక్షా 50 వేల మందికి పైగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్, తగ్గుముఖం పడుతున్న కొవిడ్ వ్యాప్తి, గడిచిన 24 గంటల్లో 197 కేసులు నమోదు

తెలంగాణలో కొవిడ్ నివారణ వ్యాక్సిన్ కొనసాగుతోంది, ఇప్పటివరకు అధికారికంగా పేర్కొన్న గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,51,243 మందికి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు....

COVID in TS: తెలంగాణలో 1 లక్షా 50 వేల మందికి పైగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్, తగ్గుముఖం పడుతున్న కొవిడ్ వ్యాప్తి, గడిచిన 24 గంటల్లో 197 కేసులు నమోదు
Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Hyderabad, January 29: తెలంగాణలో కొవిడ్ నివారణ వ్యాక్సిన్ కొనసాగుతోంది, ఇప్పటివరకు అధికారికంగా పేర్కొన్న గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,51,243 మందికి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఇప్పటికీ కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది.  నిన్న రాత్రి 8 గంటల వరకు 31,486 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 197 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 748 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,94,120కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 38 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 13, మేడ్చల్ నుంచి 11, కరీంనగర్ నుంచి 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

 Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

అలాగే గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,596కు పెరిగింది. అలాగే,  గురువారం సాయంత్రం వరకు మరో 356 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 289,987 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,537 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jan 29, 2021 10:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).