CM KCR in the State Assembly | File Photo

Hyderabad, March 13:  ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి, గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో (Telangana)  విద్యుత్ ఛార్జీలు (Power Tariffs) , ఆస్తి పన్నులు (Property Tax) పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) శుక్రవారం పేర్కొన్నారు. తమ గ్రామాలు, నగరాల అభివృద్ధి కోసం ఈ పెంపును ప్రజలు భరించాలని ఆయన కోరారు. అయితే, నిరుపేద వర్గాల ప్రజలపై పెంపు భారం పడదని ఆయన హామీ ఇచ్చారు. పన్నులు చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర అసెంబ్లీలో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ప్రజలను అంధకారంలో ఉంచడానికి, తప్పుడు వాగ్దానాలు చేయడానికి తమ ప్రభుత్వం ఇష్టపడదని అన్నారు.

కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

“బాధ్యతారాహిత్యం, అవినీతి లేదా అవకతవకలను సహించం. సర్పంచ్‌లు మరియు అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి" అని సీఎం హెచ్చరించారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లో వంద శాతం టాక్సుల వసూలు జరిగేలా చూడాలని కోరారు.  రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం మాజీ ఎంపీ కవితకేనని ప్రచారం

అలాగే ప్రభుత్వం  రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు 5 ఏళ్ల కాలానికి ఒక్కో పంచాయతికీకి రూ. 90 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తుందని సీఎం చెప్పారు. 500 కంటే తక్కువ జనాభా ఉన్న 899 గ్రామ పంచాయతీలకు కూడా కనీసం రూ. 40 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తామని విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల అభివృద్ధికి, గ్రామ పంచాయతీలా ఆదాయాన్ని పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు.