Elections (Photo Credits: PTI)

Hyd, May 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha Polls 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ (YSRCP Candidates) బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి (TRS Candidates) నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు.

నిప్పు పెట్టిందెవరు.. కోనసీమకు అదనపు బలగాలు, కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులు రద్దు, అమలాపురంలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు గత మంగళశారం నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా దామోదర్‌రావు, బండి పార్థసారధికి జగిత్యాల ఎమ్మెల్యే బండి సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.