Road accident (image use for representational)

Gadwal, Oct 15: తెలంగాణలోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఇటిక్యాల మండ‌లం ధ‌ర్మ‌వ‌రం స‌మీపంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం (Road Accident in Gadwal) జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు.. జాతీయ ర‌హ‌దారి 44పై బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 20 మంది ప్ర‌యాణికులు (20 hurt after bus overturns on NH-44 in Gadwal) గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 50 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మడలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక ఏపీలో ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో గురువారం జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో కనిగిరి నుంచి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుకు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మావోయిస్ట్ అగ్ర నేత ఆర్‌కె మృతిపై సస్సెన్స్, ఆయన మరణించారని చెబుతున్నపోలీసులు, ఇంకా ధ్రువీకరించని మావోయిస్టు పార్టీ, గత 3 ఏళ్ల నుంచి ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న రామకృష్ణ

పోలీసులు వచ్చి ఏడుకొండలును అదుపులోకి తీసుకున్నారు. అనుకోని ఘటనతో బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎస్‌ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. విచారణలో యువకుడు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయని, త్వరలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, వాటి ధరలు తగ్గిస్తుందని.. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్‌ఐ చెప్పారు.