
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) వర్గాల ఆత్మ గౌరవం, హక్కుల కోసం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 2025 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో ఆయన అధికారికంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ను స్థాపించారు.ఈ పార్టీ బీసీల ఆత్మగౌరవాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొంటుందని మల్లన్న తెలిపారు.
పార్టీ జెండా ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో రూపొందించబడింది. జెండాలో మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, వరి కంకులతో ప్రతీకాత్మకంగా తీర్చిదిద్దారు. జెండా పై భాగంలో “ఆత్మ గౌరవం”, “అధికారం”, “వాటా నినాదాలు” స్పష్టంగా ప్రదర్శించారు. నారా గోని చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. ఆకుపచ్చ రంగు రైతులను, ఎర్ర రంగు పోరాటాన్ని సూచిస్తుందని మల్లన్న చెప్పారు. ఈ పార్టీ ఆవిష్కరణ సభకు బీసీ, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కవిత సస్పెండ్ వెనుక ఇంత కథ దాగుందా.. వరుస షాకులతో బీఆర్ఎస్ పార్టీ విలవిల, తట్టుకోలేక క్రమశిక్షణ పేరుతో సస్పెన్షన్ విధిస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం
మల్లన్న మాట్లాడుతూ.. బీఫాం లు అడుక్కునే పరిస్థితి ముగిసిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను పట్టించుకోకుండా వదిలేసినప్పుడు, మేధావులు ఒక రాజకీయ పార్టీ అవసరం అని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన రోజును చరిత్రాత్మకంగా భావిస్తూ, పెరియార్ జయంతి, విశ్వకర్మ జయంతి రోజున ఈ ఘన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చెప్పారు.TRP అధికార ప్రతినిధిగా Artificial Intelligence (AI) ని నియమిస్తున్నట్లు ప్రకటించారు.