Telangana: తెలంగాణలో కొత్త చరిత్ర, ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్యులుగా నియమితులైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు, ముందు ముందు అనేక సవాళ్లు ఎదుర్కుంటామని తెలిపిన వైద్యులు
osmania hospital (Photo-Video Grab)

Hyd, Nov 29: తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు చరిత్ర సృష్టించారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు (లింగ మార్పిడి చేయించుకున్న వారు) ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా (2 trans doctors get government jobs) ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో (Osmania General Hospital) నియమితులయ్యారు. ప్రభుత్వరంగంలో వైద్యులుగా వీరి నియామకం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి సానుకూలమని భావిస్తున్నారు.అయితే.. వీళ్లు ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది.

ఇది నిజంగా నాకు, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీకి గొప్ప రోజు. 2018లోనే వైద్య విద్య పూర్తయింది. 15 హాస్పిటల్స్ లో ఉద్యోగం కోసం తిరిగాను. కానీ నన్ను తిరస్కరించారు. అందుకు కారణం చెప్పకపోయినా నేను అర్థం చేసుకున్నాను’’ అని ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ రుత్ (Dr Ruth John Paul Koyyala) తెలిపారు. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆమె ఎంబీబీఎస్ చదివింది.

డిసెంబ‌ర్ నాటికి యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ పూర్తి చేయాలి, విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాల‌ని జెన్‌కోకు సూచించిన సీఎం కేసీఆర్

డాక్టర్ ప్రాచీ (Dr Prachi Rathore) ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. తాను ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత ఉద్యోగం నుంచి వెళ్లిపోవాలని ఓ ప్రైవేటు హాస్పిటల్ కోరినట్టు ప్రాచీ చెప్పారు. తన గుర్తింపును చూసి రోగులు వచ్చేందుకు వెనుకాడతారని చెప్పినట్టు 30 ఏళ్ల డాక్టర్ ప్రాచి మీడియాకు వెల్లడించారు. ‘‘మమ్మల్ని రోగులు వివక్షతో చూడొచ్చు. కానీ, ఒక్కసారి మేము వారికి చికిత్స అందించి, వారికి మెరుగైతే.. వారు ఇతరులను సైతం మా దగ్గరకు సిఫారసు చేస్తారు’’ అని డాక్టర్ రుత్ తెలిపారు. వీరు నీట్ పీజీ ఎంట్రన్స్ రాసినా ట్రాన్స్ జెండర్ కేటగిరీలో రిజర్వేషన్ ను కల్పించలేదని చెబుతున్నారు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

వైఎస్ షర్మిల అరెస్ట్, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం, వైస్సార్‌టీపీ అధినేత్రి కేరవాన్‌కు నిప్పంటించిన టీఆర్‌ఎస్‌ ‍శ్రేణులు, కొన్ని వాహనాల అద్దాలు ధ్వంసం

తామిద్దరం ఎన్నో తిరస్కరణల తర్వాత.. 2021లో నారాయణగూడలోని యూఎస్ఏఐడీ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరామని తెలిపారు.గత రెండేళ్లలో తాము ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నామని.. వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక వివక్షతో పోరాడాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినందుకు తాము చాలా గర్వపడుతున్నామని అన్నారు.

అయితే.. అక్కడ కూడా వీళ్లకు తప్పకుండా సవాళ్లు ఎదురవుతాయని ట్రాన్స్‌జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన తెలిపారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రయాణం ఎలా సాగుతుందో తెలీదు కానీ, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని వాళ్లిద్దరు పేర్కొన్నారు. రోగులు కూడా తమ పట్ల వివక్ష చూపించొచ్చని, కానీ ఎప్పుడైతే వైద్యం అందిస్తామో, అప్పుడు తప్పకుండా వారిలో మార్పు వస్తుందని, తామే కావాలని పేషెంట్స్ సిఫార్సు చేసేలా ఈ రంగంలో సత్తా చాటుతామని రూత్, ప్రాచీ తెలిపారు.

తాము నీట్ ఎగ్జామ్స్ రాసినా, రిజర్వ్ సీట్స్ దొరకలేదని అన్నారు. 2014లో తమని థర్డ్ జెండర్‌గా గుర్తించి.. ఉద్యోగాల ప్రవేశాల్లో రిజర్వేషన్ మంజూరు చేయాలని సుప్రీం ఇచ్చిన తీర్పుకి ఇది విరుద్ధమన్నారు. ఇక రాష్ట్ర కౌన్సెలింగ్ జాబితా తమని మహిళాగా వర్గీకరించింది.. దీనిపై తాము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ సమర్పించామని, అవసరమైన చట్టపరమైన మార్గాన్ని కూడా ఎంచుకుంటమని ప్రాచీ చెప్పుకొచ్చింది.