CEO Vikas Raj on Repolling: తెలంగాణలో రీపోలింగ్‌పై ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు, ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేసిన వికాస్ రాజ్
CEO Vikas raj (photo-Video Grab)

Hyd, Dec 1: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే... 70.74 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.

తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నారు. తెలంగాణలో 71.01 శాతం పోలింగ్‌ జరిగింది. లక్షా 80వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్‌ జరిగింది. హైదరాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

తెలంగాణ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్.. మునుగోడులో అత్యధికంగా 91.51 శాతం.. అత్యల్పంగా యాకుత్‌ పురా లో 39.9 శాతం పోలింగ్

2018లో పోలింగ్‌ 73.37 శాతం పోలింగ్‌ నమోదు అయ్యినట్టు తెలిపారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్‌ తగ్గింది. తెలంగాణలో రిపోలింగ్‌కు ఎక్కడా అవకాశం లేదు. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్‌పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్‌ ఓటింగ్‌ కల్పించామన్నారు.

ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని, ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఓటేశారని వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు.

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఇవిగో, కేసీఆర్ సర్కారుకు షాక్ తప్పదంటున్న సర్వేలు,  కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి..

దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపు జరిగింది. పోలింగ్‌పై స్క్రూటినీ ఇవ్వాళ ఉదయం నుంచి జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయి.

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయింది. లెక్కింపు జరిగినా కూడా మళ్ళీ రెండు సార్లు ఈవీఎంలు లెక్కిస్తారు. ప్రతీ రౌండ్‌కు సమయం పడుతుంది. ఈసీఐ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8.30 నిమిషాల నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్‌లో 14 ఉన్నాయి. ప్రతీ టేబుల్‌కు ఐదుగురు ఉంటారు. కౌంటింగ్‌కు సిద్ధం అవుతున్నాము’ అని అన్నారు.