File image of Telangana CM KCR | File Photo

Hyderabad, Sep 7: తెలంగాణ ‌శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత‌న భేటీఅయిన బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ (బీఏసీ) స‌మావేశ‌ం (Business Advisory Committee (BAC) meeting) ముగిసింది. సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly 2020) నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఈనెల 10, 11 తేదీల్లో అసెంబ్లీలో కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చ చేపట్టనున్నారు. అలాగే భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Chief Minister K Chandrasekhar Rao) విపక్ష సభ్యులను కోరారు.

ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్, ప్ర‌తిప‌క్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌, శాస‌న‌స‌భా వ్య‌వ‌హాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, అసెంబ్లీ సెక్ర‌ట‌రీ న‌రసింహాచార్యులు పాల్గొన్నారు.బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అసెంబ్లీ నిర్వహణపై చర్చించిన నేతలు.. ఈనెల 28 వరకు సమావేశాలు జరపాలనే నిర్ణయానికి ఒకే చెప్పారు. ఈనెల 12 రెండో శనివారం, 13 ఆదివారం, 20 ఆదివారం, 27 ఆదివారం సెలవులుపోను, మొత్తం 17 పనిదినాలు సభ జరుగనుంది.

మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం

మంగళవరం నాటి సభలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల అంశంపై చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎత్తివేత కరెక్ట్ కాదని సీఎల్పీ నేత భట్టి బీఏసీలో తన నిరసన తెలిపారు. కొవిడ్ కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

కొత్త రెవెన్యూ చట్టంపైనే అందరి కన్ను, కరోనా నెగెటివ్ ఉంటేనే అసెంబ్లీలోకి ఎంట్రీ

మీడియా పాయింట్ ఎత్తివేయడంపై సమావేశంలో గరం గరం చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మీడియా పాయింట్ ఎత్తివేయడంపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. కోవిడ్ నేపథ్యంలోనే మీడియా పాయింట్ అనుమతించలేదని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా వివిధ కారణాల దృష్ట్యా ఈ నెల 12, 13, 20, 27 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. కాగా సోమవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనసభ ప్రగాఢ సంతాపం తెలిపింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో ఆ ఇద్దరి పాత్రను నేతలు గుర్తుచేసుకున్నారు. ప్రణబ్‌ మరణం పట్ల సంతాపం తీర్మానాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంతాపం తీర్మానం సందర్భంగా సీఎం, మంత్రులు మాట్లాడారు. నిత్యం ప్రజల మధ్యే తిరుగుతూ నిరాడంబరంగా జీవించిన నాయకుడు రామలింగారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు.