
Hyd, Feb 16: తెలంగాణలో సమగ్ర కుటంబ రీసర్వే మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ రీసర్వే చేపట్టారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటుచేశారు(Telangana Caste Census Resurvey). స్వచ్ఛందంగా ముందకొచ్చి అడిగినవరి వివరాలు నమోదు చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.
గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీవో కార్యాలయాలు,అర్బన్ ప్రాంతాల్లో నివసించేవారు ఆయా ప్రాంతాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్లి సమగ్ర కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వెబ్‌సైట్ నుంచి ఫాం డౌన్‌లోడ్ చేసుకొని, నింపి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వొచ్చని తెలిపారు. కులగణన(BC Caste Census) కోసం 040-21111111 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు.
ఇంటింటి సర్వే కులగణనకి అవసరమైన విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఛైర్మన్‌గా ఆరుగురు మంత్రులతో సెప్టెంబరు 12న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. నవంబరు 6 నుంచి సుమారు లక్ష మంది ఎన్యుమరేటర్లు 76 ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటిసామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 96.90శాతం సర్వే జరుగగా మిగిలిన వారం కోసం తాజాగా రీసర్వే చేపట్టారు.
ఇంటింటిసమగ్ర సర్వే ఆధారంగానే రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ కుల గణన తప్పుడు సర్వే అని,ప్రభుత్వం కావాలనే బీసీల జనాభాను తగ్గించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వం మాత్రం దేశానికే ఆదర్శంగా కులగణన చేపట్టామని, అసెంబ్లీ చట్టం చేస్తామని ప్రకటించింది.