Telangana Chief Minister Revanth Reddy Helps to tribal girl Sai shraddha(CMO X)

Hyd, Oct 30:  డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.

కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి రాగానే వారు వెంటనే స్పందించారు. ఆ విద్యార్థిని కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.  బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్, దళిత బంధు పేరుతో మోసం చేశారు...డబ్బులు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని హెచ్చరిక 

Here's Tweet:

సాయిశ్రద్ధ తల్లిదండ్రులతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవగా, వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సందర్భంగా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.