File image of Telangana CM KCR | File Photo

Hyderabad, July 22: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల (Prisoners Release in TS) చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (TS CM KCR) పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని పోలీస్‌ శాఖను (Police Department) కోరారు.

ప్రగతి భవన్‌లో ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. కరోనా వ్యాక్సిన్ తొలి అడుగు విజయవంతం, నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు వాలంటీర్లు, అంతా సవ్యంగా ఉంటే వారికే రెండో డోస్‌ టీకా

ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రైతుల‌కు ఇచ్చిన ప్ర‌తి మాట‌ను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుప‌డి ఉంద‌ని అన్నారు. ఈ దిశ‌గా అనేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. రైతు బంధు ప‌థ‌కం అమల‌వుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

Here's Telangana CMO Tweet

రైతు వేదిక‌ల నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ స‌మావేశంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, రైతు బంధు క‌మిటీ చైర్మ‌న్ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.