CM KCR

Hyd, August 29: పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని సీఎం (CM KCR inaugurates Integrated Collectorate Complex) ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ (CM KCR)మాట్లాడుతూ.. ‘భారత దేశమే ఆశ్యర్చపడే విధంగా తెలంగాణలో (Telangana) పాలన సాగిస్తున్నాము. తెలంగాణ ప్రగతిపై వివిధ రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. 26 రాష్ట్రాల రైతు నాయకులు తెలంగాణ సాగు విధానంపై ఆరా తీశారు. రైతు నాయకులు నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది. బీజేపీ (BJP) అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) స్వరాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. గాంధీ మద్యపానం నిషేధించిన గుజరాత్‌ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యానికి ఎందరో​ బలయ్యారు. దీంతో మీ సమాధానం ఏంటీ మోదీ. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది.

మతాల పేరిట గొడవలు పెట్టుకోమ్మని ఏ దేవుడు చెప్పాడు, హైదరాబాద్‌ గొడవలపై స్పందించిన కేటీఆర్, ప్రజలు ఏం తినాలో బీజేపీ డిసైడ్ చేస్తుందా? అంటూ మండిపడ్డ కేటీఆర్‌

మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో దోపిడీ తప్ప మరేమీ లేదు. ఇక్కడ ఉండే నాయకులతో చెప్పులు మోయించుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే దోపిడీ దొంగలు.. వాళ్ల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు. ఆత్మగౌరవంతో ఉందామా.. గులాంలుగా మారుదామా?. బీజేపీ అవినీతి గ‌ద్ద‌ల‌ను గ‌ద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి ప‌లుకాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశార‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

గుజరాత్‌ మోడల్‌ పేరుతో దేశాన్ని నాశనం చేశారు. నరేంద్ర మోదీ తీరు కారణంగా.. శ్రీలంకలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతింది. ప్రధాని మోదీ గో బ్యాక్‌ అంటూ లంకేయులు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రాదు. రైతులకు మీటర్‌ పెట్టాలంటున్న మోదీకే మీటర్‌ పెడుదామం. బీజేపీ ముక్త్‌ భారత్‌ అంతా కలిసి రావాలి. ధాన్యం కొనమంటే కేంద్రానికి కొనడం చేతకాదు. తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల గోధుమలు, బియ్యం దిగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గజదొంగలు, లంచగొండులు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేది అంతా అబద్దమే. బీజేపీని పారదోలి 2024లో రైతుల ప్రభుత్వం రాబోతోంది’ అని తెలిపారు.

రైతుల ప‌ట్ల క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పార‌ద్రోలాల‌ని పిలుపునిచ్చారు. రైతుల‌కు మీట‌ర్ పెట్టాల‌ని అంటున్న ఈ మోదీకే మీట‌ర్ పెట్టాల‌న్నారు.రైతుల‌కు మేలు చేస్తూ పేద‌ల‌ను ఆదుకుంటుంటే వాటిని ఉచితాలు అని బంద్ పెట్టాల‌ని అంటున్నారు. ఉచిత క‌రెంట్ ఇస్తే మీట‌ర్ పెట్టాల‌ని అంటున్నారు. రేపు రాబోయే భార‌త‌దేశంలో ఈ బీజేపీని పార‌దోలి రైతుల ప్ర‌భుత్వం రాబోతుంది. ఈ గోల్ మాల్ ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర ప్ర‌భుత్వం ప‌చ్చి అబ‌ద్దాల ఆడుతూ, దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు.

దేశంలోని మొత్తం వ్య‌వ‌సాయానికి వాడే క‌రెంట్ కేవ‌లం 20.8 శాతం మాత్ర‌మే. దాని ఖ‌రీదు ఒక ల‌క్షా 45 వేల కోట్లు.ఓ కార్పొరేట్ దొంగ‌కు దోచిపెట్టినంత కాదు క‌దా మోదీ. రైతుల కోసం మీరు బ‌య‌ల్దేరండి అని ఆయా రాష్ట్రాల రైతులు న‌న్ను కోరారు. మీట‌ర్ లేని రైతు రావాల‌ని కోరారు. భార‌త‌దేశం స్వాగ‌తం ప‌లుకుతుంద‌న్నారు. రైతుల‌కు మీట‌ర్ పెట్టాలని అంటున్న‌ మోదీకి మ‌నంద‌రం క‌లిసి మీట‌ర్ పెట్టాలి. ఆ ప‌ని చేస్తే మ‌న‌కు పీడ వోత‌ది. ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేదు. అనేక రంగాల్లో అవినీతి నెల‌కొని ఉంద‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.