CM KCR Wanaparthy Tour: మ‌త పిచ్చి లేపి దేశాన్ని నాశ‌నం చేస్తున్నారు, బీజేపీని బంగాళాఖాతంలో విసిరి పారేయండి, వనపర్తి టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR atTRS Plenary Meeting (Photo-Video Grab)

Hyd, Mar 8: తెలంగాణ సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభంతో పాటు శంకుస్థాపన చేశారు. వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ని (CM KCR launches 'Mana Ooru-Mana Badi) ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR ) మాట్లాడుతూ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి వనపర్తి వేదికగా శ్రీకారం చుట్టామన్నారు.

సర్కార్‌ బడుల్లో అన్ని వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేవన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉందన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు.

సర్కారు బడుల్లో చక్కటి వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులంతా శ్రద్దగా చదువుకోవాలని సీఎం సూచించారు. మేమంతా సర్కారు బడుల్లో చదివామన్నారు ‘‘వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ప్రారంభిస్తామ‌ని సీఎం పేర్కొన్నారు. భ‌విష్య‌త్‌లో చాలా చ‌క్క‌టి వ‌స‌తులు పాఠ‌శాల‌ల్లో ఏర్పాటవుతాయన్నారు. భ‌విష్య‌త్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, అసెంబ్లీలో రేపు 10 గంటలకు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

వనపర్తిపై (CM KCR Wanaparthy Tour) సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సీఎం సహాయనిధి నుంచి వనపర్తి పట్టణానికి రూ.కోటీ, మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అలాగే విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. వ‌న‌ప‌ర్తిలో మెడిక‌ల్ కాలేజీని, వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. చాలా పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నామని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. కరెంట్‌ కోతలు, తాగు, సాగు నీరు సమస్యలను అధిగమించామని చెప్పారు. ఇది ప్రజలందరి శ్రమ ఫలితమని సీఎం కేసీఆర్‌ అన్నారు.

నన్ను ఎవరూ భయపెట్టలేరు, నేను దేనికి భయపడను, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

వనపర్తి జిల్లా ప్రజలను నిరంజన్‌రెడ్డి గెలిపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘నిరంజన్‌రెడ్డి ఏంఏం పని చేసిండో.. ఆయన పడే తపన ఏందో.. ఘణపురం మండలం ఏమో నాకు తెల్వది. కర్నెతండా లిఫ్ట్‌ కావాలని వెంబండి పని మంజూరు చేయించాడు. నీళ్ల నిరంజన్‌రెడ్డి అని మీరు పేరు పెట్టిన్రు. ఆనాడు ఇంజినీరింగ్‌ కాలేజీ, రాజాగారి బంగ్లాలో ఎన్నికల సభలో ఒకటే హామీ ఇచ్చినా.ఆ నాడు నిరంజన్‌రెడ్డిని గెలిపివ్వండి.. మీ ప్రాంతం పచ్చపడుతది లాభమైతది చెప్పాను. నిరంజన్‌రెడ్డిని మీరు గెలిపించారు.. మిమ్మల్ని వనపర్తి ప్రజలను నిరంజన్‌రెడ్డి గెలిపించారు. ఈ సారి నిరంజన్‌రెడ్డి నామినేషన్‌ వేస్తే లక్ష మెజారిటీతో గెలువాలని తెలిపారు.

మ‌న‌కు కొన్ని స‌మ‌స్యలు ఉన్నాయి.. మా గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మేము ప‌ల‌చ‌బ‌డ్డాం ఆనాడు. ఇప్పుడు 10 శాతం కావాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పంపితే దాన్ని న‌రేంద్ర మోదీ కింద పెట్టుకొని కూర్చున్నాడు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వాల్మీకీ బోయ‌లు.. ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు. వేరే రాష్ట్రాల్లో వాళ్ల‌ను గిరిజ‌నుల‌లో పెట్టారు. ఎస్టీల‌లో పెట్టారు. మ‌మ్మ‌ల్ని కూడా పెట్టాల‌ని కేంద్రానికి పంపితే.. దాన్ని కూడా కేంద్రం బేఖాత‌రు చేస్తోంది. అంటే.. కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు డిమాండ్లు తెలియ‌వు. ప్ర‌జ‌ల ఆవేశం తెలియ‌దు. ప్ర‌జ‌ల అవగాహ‌న తెలియ‌దు. మూర్ఖ‌మైన‌టువంటి మొండి ప‌ద్ధ‌తిలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు.

తెలంగాణలో తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో 91 మందికి కరోనా, హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు

న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ ప‌నికిమాలిన మ‌త‌పిచ్చిగాళ్ల‌ను కూక‌టి వేళ్ల‌తో పెకిలించి.. బంగాళాఖాతంలో విసిరేయాల‌ని నేను మ‌న‌వి చేస్తున్నా. అప్పుడు కానీ మ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు. మ‌న వాల్మీకీ బోయ‌ల‌కు గిరిజ‌న ప‌ద్ధ‌తిలో రావాల‌న్నా.. మ‌న గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. మ‌నం ముందుకు పోవాల‌న్నా.. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉన్న కాషాయ జెండాల‌ను.. భార‌తీయ జ‌న‌తా పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాల‌ని మ‌న‌వి చేస్తున్నా.

దాని కోసం మ‌నం సంసిద్ధంగా ఉండాలి. పోరాటం చేయాలి. ఎక్క‌డివాళ్లు అక్క‌డే నిల‌దీయాలి. న్యాయం కోసం పురోగ‌మించాలి. దుర్మార్గ‌మైన ప‌ద్ధ‌తిలో ఈ దేశాన్ని నాశ‌నం చేసే వాళ్లకు.. ప్ర‌జ‌ల‌కు మ‌త పిచ్చి లేపి దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసేవాళ్ల‌కు బుద్ధి చెప్ప‌డానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలి. దేశ రాజ‌కీయాల‌ను కూడా చైత‌న్య ప‌రుస్తా. మ‌డ‌మ వెన‌క్కి తిప్ప‌కుండా ముందుకు సాగి.. బంగారు తెలంగాణ లాంటి బంగారు భార‌తదేశాన్ని కూడా త‌యారు చేయ‌డానికి పురోగ‌మిద్దామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.