TS Early Elections Row: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. సీఎం కేసీఆర్ సవాల్‌కు సై అన్న బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరిన ఈటల రాజేందర్
KCR vs Bandi Sanjay (File Image)

Hyd, July11: దేశంలో అన్ని రకాలుగా అ«థోగతి పాలవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసమర్థ పాలన, బీజేపీ విధానాలే కారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. దేశం ఇంత అసమర్థ ప్రధానిని ఇంతకుముందెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. నిష్క్రియ, అవివేక, అసమర్థ పాలనను మోదీ సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని జలగలా పీడిస్తోందని, ఇందిరాగాంధీ గతంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌ హాట్ టాఫిక్ గా మారాయి. కాంగ్రెస్‌, బీజేపీలు డేట్‌ చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తానని.. ముందస్తు ఎన్నికలకు (CM KCR Open Challenge) వెళదామంటూ సీఎం కేసీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. మొదటి సారిగా ముందస్తు ఎన్నికలపై (Early Elections) కేసీఆర్‌ వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ఆచితూచి స్పందిస్తున్నాయి.

తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని.. అనడం అహంకారం.. వివేకానికి నిదర్శనం. వాళ్లకు దమ్ముంటే డేట్‌ డిక్లేర్‌ చేస్తే నేను అసెంబ్లీ రద్దుకు సిద్ధమంటూ కేసీఆర్‌ (CM KCR) సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? మేం స్కాంస్టర్లము కాదు. కుంభకోణాలు చేయలేదు. అపకీర్తి మూట కట్టుకోలేదు. ప్రజల కోసం మంచి పనులు చేశాం. వాళ్లే గెలిపిస్తారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని బీజేపీ భయపడుతోందని కేసీఆర్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ సవాల్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) స్వీకరించారు. ముందస్తు ఎన్నికలకు బీజేపీ (BJP) సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారని, కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టే అవసరం తమకు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికల అంశాన్ని కేసీఆర్ తెరమీదకు తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఆదివారం నాటి ప్రెస్‌మీట్‌లో కనిపించిన కేసీఆర్‌ ముఖంలోని భయాన్ని ప్రజలందరూ గమనించారని ఎద్దేవా చేశారు.

లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయండి, ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాలి, అధికారులతో వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష

సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (MP Uttam Kumar Reddy) స్పందించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ (Congress) సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నువ్వు సవాల్ చేయడం కాదు.. ముందు అసెంబ్లీ రద్దు చేయ్‌ అంటూ సవాల్‌ విసిరారు. తక్షణమే అసెంబ్లీ రద్దు చేయాలని శాసనసభ రద్దయితే ఆటోమెటిక్‌గా ఎన్నికలు వస్తాయని, ఎన్నికలకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. తెలంగాణకు నరేంద్రమోదీ, కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.. రాష్ట్రంలో నీళ్లు వచ్చే ప్రాజెక్టులు కాంగ్రెస్ నిర్మిస్తే.. పైసలు వచ్చే ప్రాజెక్టులు కేసీఆర్ చేపట్టారని మండిపడ్డారు.

ఈటెల సవాల్

సీఎం కేసీఆర్‌ (CM KCR)పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala Rajender) తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరారు. తెలంగాణ (Telangana)కు పట్టిన శనిని వదిలించటమే తన లక్ష్యమని ప్రకటించారు. డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని చెప్పారు. ‘‘నా తల్లి నాకు సంస్కారం, తెలంగాణ సమాజం సహనాన్ని ఇచ్చింది. హుజురాబాద్ (Huzurabad) ప్రజలు ధైర్యాన్ని ఇచ్చారు. కేసీఆర్ చెప్పే మాటలు, చేసే పనులకు పొంతన లేకపోవడంతో నాపై కక్ష కట్లారు. నా లాంటి వారు కేసీఆర్ నచ్చలేదు. ఆయనకు కావాల్సింది బానిసలు. అసెంబ్లీలో నా ముఖం కన్పించకుండా ఉండేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేశారు.

పోలీసులు లేకుండా రావాలన్న నా భార్య సవాల్‌కు.. కేసీఆర్ సచ్చిపోవాలి. 50 శాతమున్న బీసీలకు 3 మంత్రి పదవులా?.. గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు?.. నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహింవేది లేదు. తన్ని తరిమికొడతాం’’ అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.కేసీఆర్‌ను ఈటల టార్గెట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. తన ప్రస్థానం గజ్వేల్‌ నుంచే ప్రారంభమైందని, ఇక్కడి నుంచి పోటీకి సంబంధించి ఇప్పటికే తాను క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ నేత సువేందు అధికారి, అక్కడి సీఎం మమతా బెనర్జీని ఓడించినట్లుగానే, తాను ఇక్కడ సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే మా పార్టీ నేతలు ఈగోలు పక్కనబెట్టాలి. చెట్టుకొమ్మపై ఉన్న పక్షి కన్ను మాత్రమే అర్జునుడికి కనిపించినట్లు, కేసీఆర్‌ మాత్రమే మాకు లక్ష్యం కావాలి’’ అని ఈటల వ్యాఖ్యానించారు.