Hyderabad, June 13: తెలంగాణలో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష (cm-kcr-review-on-palle-pragathi) నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే ఈ కార్యక్రమానికి ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపి ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అమలు తీరుపై సీఎం సమీక్షించారు. జిల్లాల వారీగా కార్యక్రమాల అమలు, పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. కాగా ఈ నెల 19 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు (surprise visits to panchayats municipalities after June 19)చేసి పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతా. ఈనెల 21న వరంగల్ జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి పనులపై తనిఖీలు చేస్తా. 10 రోజులు సమయం ఇచ్చి తనిఖీలకు వస్తా. గ్రామ సభలు నిర్వహించకుంటే సర్పంచ్‌లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని సీఎం తెలిపారు.
రైతుబంధు పథకంలో (Telangana Rythu Bandhu) భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 15 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నారు. రైతుబంధు అర్హులపై తుది జాబితా రూపొందించిన సీసీఎల్ఏ, ఆ జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది. రైతుబంధుకు (Rythu Bandhu scheme) 63.25 లక్షల మంది అర్హులని ఆ జాబితాలో పేర్కొన్నారు. రైతుబంధుకు గతంలో కంటే ఈసారి 2.81 లక్షల మంది రైతులు పెరిగారు.
కాగా, బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, ఈసారి రైతుబంధు లబ్దిదారుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు ఉన్నారు.