Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, May 15: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా (CM KCR VC Postponed) పడింది. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో నిర్వహించాల్సిన సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదాపడిందని రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రకటించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌ (Pragati Bhavan) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని నిన్న ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో మరో 47 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1414కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య

అనివార్య కారణాల వల్ల ఈ వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాల్సిన అవసరం.. చేసే విధానంపై సీఎం కేసీఆర్‌ (Telangana CM k chandrasekhar rao) దిశానిర్దేశం చేస్తారని అధికార వర్గాలు నిన్న ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాలశాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారులతో పాటు జిల్లా, మండల, గ్రామస్థాయి రైతుబంధు సమితుల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. గత 24 గంటల్లో 3,967 కోవిడ్-19 కేసులు, దేశంలో 81 వేలు దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, ఇప్పటివరకు 2,649 మంది మృతి

మొత్తం 32 జిల్లా కలెక్టరేట్లతోపాటు మొత్తం 600 కేంద్రాల నుంచి ఒకేసారి అందరు అధికారులు, సిబ్బంది మొత్తం 20 వేలమంది ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో పాల్గొననున్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాల్సిన అవసరం.. చేసే విధానంపై ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఇవి వాయిదా పడటంతో మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.