
Hyderabad, July 13: తెలంగాణ రాజ్‌భవన్‌లో (Telangana Raj Bhavan) 38 మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యుల్లో 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా గవర్నర్‌కు ( Governor Tamilisai ) నెగెటివ్ అని తేలింది. రాజ్‌భవన్‌లో విధులు నిర్వహిస్తున్న 28 మంది స్పెషల్ పోలీసు బెటాలియన్ సిబ్బంది, 10 మంది ఉద్యోగులు, మరో 10 మంది వారి కుటుంబసభ్యులు కరోనా బారి నపడినట్టు రాజ్‌భవన్ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో 34 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1269 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 350 దాటిన కరోనా మరణాలు
రాజ్‌భవన్ పోలీసు సిబ్బందిలో కొందరు కోవిడ్-19 భారినపడడంతో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai Soundararajan) చొరవ తీసుకుని రెండ్రు రోజులుగా రాజ్‌భవన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయించారు. తాను కూడా పరీక్ష చేయించుకున్నారు. 395 మందికి పరీక్షలు నిర్వహించగా, 347 మందికి నెగెటివ్, 48 మందికి పాజిటివ్ వచ్చింది. గవర్నర్‌కు కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది. కరోనా సోకిన రాజ్‌భవన్ సిబ్బంది, కుటుంబసభ్యులను ఎస్‌ఆర్ నగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి, 28 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. రెడ్‌జోన్లలో నివసిస్తున్న ప్రజలు, కరోనా సోకినవారితో కాంటాక్ట్ ఉన్న వారు తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. భారీగా కోలుకున్న కరోనా బాధితులు, దేశంలో ఇప్పుడు కోవిడ్-19 యాక్టివ్ కేసులు 3,01,609 మాత్రమే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 8,78,254
పోలీసులు మినహా మిగతా 20 మందికీ ఎస్‌ఆర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య (Telangana COVID-19 pandemic) 34671కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్‌లో 94, సంగారెడ్డిలో 36, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో 23 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 17, నల్లగొండ, వనపర్తిలో 15 చొప్పున, మెదక్‌లో 14 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనాతో 8 మంది మృత్యువాత పడగా.. మరణాల సంఖ్య 356కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1563 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 22482కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 11883గా ఉంది. ఆదివారం 8153 నమూనాలు సేకరించారు. కాగా.. కొవిడ్ పేషెంట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17,081 పడకలను ఏర్పాటు చేయ గా, అందులో కేవలం 10 శాతమే ఆక్యుపెన్సీ ఉందని, మిగిలిన 90ు పడకలు ఖాళీగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.