Hyd, Mar 15: కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయుల డీఏలు చెల్లించలేదని తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని మోసం చేశారన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ (Congress) మోసం చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్నది వచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవు అని విమర్శించారు.
రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. కావాలంటే ఆత్మహత్య చేసుకున్న రైతన్నల పేర్లు, ఫోన్ నెంబర్లు, గ్రామాల పేర్లతో కూడిన వివరాలను కూడా అందజేస్తానని మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఉపాధి కోల్పోయి 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని.. పనిలేక సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి తరలించిన అధికారులు, కవిత ఇంటిముందు హైటెన్షన్
పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని అన్నారని.. కానీ దానిపై అతీగతి లేదని హరీశ్ రావు అన్నారు. రైతు రుణమాఫీపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. ఆసరా ఫించన్లు పెంచుతామని.. ఉన్న పెన్షన్లు సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే.. రేవంత్ రెడ్డి కరువు పెంచడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కిట్లలో పోటీ పడితే.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తిట్లలో పోటీ పడుతున్నాడని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. 100 రోజుల్లో రేవంత్‌రెడ్డి ఏమైనా సాధించారా? అంటే పది సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారని అన్నారు. అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.రైతుబంధు పడలేదని అడిగితే.. చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి చెబుతారని.. ఇదీ వంద రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘనత అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ పై మహిళల దాడి, ఫ్లెక్సీ వివాదంలో దేదీప్యరావుపై దాడి చేసిన స్థానికులు, పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు
కేసీఆర్ అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేశారని.. ఆయనపై సీఎం, మంత్రులు దిగజారి నీచమైన వ్యాఖ్యలు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. ఈ వంద రోజుల్లో సీఎం మాట్లాడిన తీరు.. ఆయన వ్యవహార శైలితో బడే భాయ్.. చోటే భాయ్ బంధం రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైందని తెలిపారు.
ట్లు ఎత్తితే మీ పార్టీలో ఎవరూ మిగలరని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. పార్టీల గేట్లు ఎత్తడం కాదు.. ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్లు ఇచ్చి పంటలను కాపాడండి అని సూచించారు. పరిపాలించడానికి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారని వాళ్లను ఆదుకోవాలని హితవు పలికారు.