Hyd, Feb 27: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme in Telangana) ద్వారా రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని.. అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా చిత్తశుద్ధితో ఒక్కో పథకం అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) అన్నారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు.
కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం (UPA Govt) భావించి.. రూ.1,500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ రూ.1,200కి పెంచింది. పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతుంది’’ అని సీఎం స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. తెలంగాణ రైతుబంధులో రూ. 2 కోట్ల గోల్ మాల్, రైతులు చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి సొమ్మును కాజేసిన వ్యవసాయ అధికారి
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తుక్కుగుడలో సోనియా గాంధీ హామీ ఇచ్చారు. సోనియా గాంధీ హామీ మేరకు కాంగ్రెస్ కు (Congress) ప్రజలు పట్టం కట్టారు. రెండు పథకాలను చేవెళ్ళలో ప్రారంభించాలి అనుకున్నాం. ఎమ్మెల్సీ కోడ్ వల్ల అక్కడి నుంచి సెక్రటేరియట్ కు మార్చాల్సి వచ్చింది. ప్రియాంక గాంధీ కోడ్ కారణంగా రద్దు చేసుకున్నారు. కట్టెలపోయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ ను ఆనాడే తక్కువకు ఇందిరా గాంధీ ఇచ్చారు.
యూపీఏ హయాంలో కాంగ్రెస్ దీపం పథకం తీసుకొచ్చింది. రూ.400 కేగ్యాస్ సిలిండర్ అందించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1200కు సిలిండర్ రేటు పెరిగింది. మోదీ గ్యాస్ ధరలు పెంచితే కేసీఆర్ సబ్సీడీ ఇవ్వలేదని సీఎం తెలిపారు. సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం. ఆమె ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా పాలన చేస్తాం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాం అని సీఎం రేవంత్ అన్నారు.