Representational Image (Photo Credits: File Image)

Hyderabad, Feb 24: హైదరాబాద్ నగరంలో పది రోజుల క్రితం ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్‌ కలకలం రేపిన సంగతి విదితమే. పోలీసులు దీనిపై దర్యాప్తు జరపగా అదంతా ఆ అమ్మాయి ఆడిన డ్రామా (Ghatkesar Incident) అని తెలిసింది. దీంతో యువతిపై సోషల్ మీడియా వేదికగా అనేక మంది విమర్శలు చేశారు. ఈ విమర్శలతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య (Ghatkesar Incident B Pharmacy Student attempts suicide) చేసుకుంది. ఆ ఘటన అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత యువతి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది.

ఈ క్రమంలో మంగళవారం యువతి షుగర్‌ ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని ఘట్కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి వరకు బాగానే ఉన్న యువతి బుధవారం ఉదయం 10 గంలకు చికిత్స పొందతూ మృతి Ghatkesar Incident B Pharmacy Student Dies) చెందింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత విద్యార్థిని డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించారు.

రేప్ కట్టుకథతో పోలీసులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన యువతి, ఘట్ కేసర్ అత్యాచార ఘటన అంతా అబద్ధం, మీడియాకు వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్

మేడ్చల్‌ కండ్లకోయలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ఫిబ్రవరి 10న సాయంత్రం 6.30కు కిడ్నాప్‌కు గురైన వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ఆటోడ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి, ఘట్‌కేసర్‌ వైపు తీసుకెళ్తున్నాడంటూ సదరు యువతి డయల్‌-100కు ఫోన్‌ చేసింది. వెంటనే కీసర, ఘట్‌కేసర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. రెండు గంటల తర్వాత ఆమెను పోలీసులు గుర్తించారు. తాను రైప్‌కు గురయ్యానంటూ ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

అయితే అన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు.. ఆ యువతిని నిలదీయగా.. తన నాటకానికి ముగింపు పలికింది. తనకు ఇంట్లో తల్లిదండ్రులతో ఉండడం ఇష్టం లేదని, ఎక్కడైనా ఒంటరిగా గడపాలని ఉందని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందని తెలిస్తే.. తల్లిదండ్రులే వదిలించుకుంటారని అలా చేసినట్లు ఒప్పుకొంది. అందులో భాగంగానే నాటకం ఆడినట్లు చెప్పింది. ఆటోడ్రైవర్‌పై నిందలు వేయడానికి కారణం అడగ్గా.. లాక్‌డౌన్‌ సమయంలో ఆ ఆటోడ్రైవర్‌ ఎక్కువ చార్జీ వసూలు చేస్తూ.. పొగరుగా మాట్లాడినట్లు తెలిపింది. ఇరికించాలనే అతని ఫొటోను ఇచ్చినట్లు చెప్పింది.

వింత శబ్దాలతో భయపెట్టేవారికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్, వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు, మెకానిక్‌లపైనా చర్యలు తప్పవు

6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్‌ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్‌ విద్యార్థితోనూ కిడ్నాప్‌ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్‌ భగవత్‌ సత్కరించారు. ఇంత జరిగినా.. ఆమెలో పశ్చాత్తాపం లేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరించారు.