telangana-government-appoints-food-safety-task-force-in-hostels-gurukulas(X)

Hyd, Nov 28:  తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్, గురుకులాలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్పటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ / వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసింది.

కమిటీ సభ్యులు తిన్నాకే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని ఆదేశించింది. ప్రతీ రోజు వంట చేసే ముందు స్టోర్ రూమ్, కిచెన్ ఫోటోలు తీసి పరిశీలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి.

వ‌స‌తిగృహాల్లో త‌ర‌చూ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు అన్నారు. పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు. విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అంద‌జేయాలన్నారు. వసతి గృహాల ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం, తప్పుడు ప్రచారం చేస్తే శిక్షిస్తామని హెచ్చరిక

బాధ్యులైన వారిపై వేటు వేయాల‌ని ఆదేశించారు. అనంత‌రం నివేదిక‌ల‌ను సమ‌ర్పించాలన్నారు. ప‌లుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొర‌పాట్లు చోటుచేసుకుంటుండంపై సీఎం ఆవేద‌న వ్యక్తం చేశారు. లేని వార్త‌లను ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని.... వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి ఆదేశించారు.