Hyderabad, April 11: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాల్సిందేనని ( Fine on mask in Hyderabad) ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా ( fine of Rs 1,000 for who not wearing masks) విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జరిమానాతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌యాక్ట్-2005, ఐపీసీ సెక్షన్ 188, 51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు అవసరమైన అధికారాలను ఇచ్చింది. జీవోను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు.
కరోనా నిబంధనలపై నగర పోలీసులు గట్టి చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మాస్క్ లేకుండా బయటకి వస్తే జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో కోవిడ్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించకుండా, గుంపులు గుంపులుగా జనం ఉంటే కేసులు నమోదులు చేస్తామని హెచ్చరించారు.
మాస్కులు లేకుండా బయట తిరిగితే ‘పెట్టీ కేసులు’ నమోదు చేయనున్నట్టు తెలిపారు. షాపింగ్ మాల్స్, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో నిబంధనలను పక్కాగా పాటించాలని చెబుతున్నారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే షాపు యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, ఏపీడెమిక్ డీసీసెస్ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,759 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నారు. 13,366 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 551 కేసులు నమోదయ్యాయి.