Telangana HC: మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందే, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన టీఎస్ హైకోర్టు, మృతదేహాలకు టెస్టులు అవసరం లేదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
High Court of Telangana | (Photo-ANI)

Hyderabad: రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు (Telangana HC) కీలక వ్యాఖ్యలు చేసింది. మృతదేహాలకు కూడా ‘కరోనా’ పరీక్షలు (COVID-19 tests on dead bodies) నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మృతదేహాలకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణలో 69 శాతం కోలుకున్న కరోనా బాధితులు, యాక్టివ్ కేసుల సంఖ్య 4 వందల లోపే; లాక్డౌన్ సడలింపుల వల్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్న వైద్య, ఆరోగ్య శాఖ

ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. మృతదేహాలకు పరీక్షలు చేయకపోతే త్వరలోనే మూడో స్టేజ్‌కు చేరుకునే ప్రమాదం ఉందని ధర్మాసనం ముందు వాదించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని వాదించారు. ఈ క్రమంలో... మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్రం అనుసరిస్తోన్న విధానాలను నివేదించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇళ్లలో నుండి బయటకు రావొద్దు, చిరుతను పట్టుకుంటామని తెలిపిన అధికారులు, హైదరాబాద్ నగర వాసులను పరుగులు పెట్టిస్తున్న చిరుత పులి

దీంతో పాటుగా పిటిషనర్ పలు రాష్ట్రాల్లో చనిపోయిన వైద్యులకు పరీక్షలు నిర్వహించిన తరువాతనే వైరస్‌ బయటపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను అనుసరిస్తోందో తమకు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు దీనిపై పూర్తి నివేదిక అందించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరుపుతున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.