MP Bandi Sanjay Bail Row: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు, వ్యక్తిగత పూచికత్తు కింద రూ. 40 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం, తదుపరి విచారణ ఈనెల 7కు వాయిదా
MP Bandi Sanjay Kumar - Telangana BJP President | File Photo

Hyd, Jan 5: బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్‌ జుడిషియల్ రిమాండ్‌పై స్టే విధించిన హైకోర్టు.. ఆయనకు బెయిల్‌ (MP Bandi Sanjay Bail Grants) మంజూరు చేస్తూ బుధవారం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పూచికత్తు కింద రూ. 40 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్‌పై (MP Bandi Sanjay) తరపు న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. బండి సంజయ్‌పై అక్రమ కేసులు, సెక్షన్స్ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.

ఇదంతా ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా బండి సంజయ్‌పై తప్పుడు కేసులు నమోదు చేసిందని కోర్టుకు విన్నవించారు. బండి సంజయ్‌ కు మేజిస్ట్రేట్ జ్యూడిషల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైంది కాదని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. దేశాయ్‌ వాదనలు విన్న హైకోర్టు (Telangana high court) కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని పేర్కొంది. అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్‌ఐఆర్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. రాత్రి 10:50 అరెస్టు చేస్తే 11 గంటల 15 నిమిషాలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సరైనది కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

ఇది మనకు ధర్మ యుద్ధం, కేసీఆర్‌ది అప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే పనిగా పెట్టుకున్నారు, పార్టీ ఆఫీసులో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని పోలీసులను ప్రశ్నించింది. పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 17వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైనది కాదంటూ.. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.

ఎంపీ బండి సంజయ్‌‌కు హైకోర్టులో చుక్కెదురు, లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సింగిల్‌ బెంచ్‌, ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బండి సంజయ్‌ కరీంనగర్‌లో జాగరణ దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. కోవిడ్‌ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ సంజయ్‌ దీక్షను భగ్నం చేసి లాఠీఛార్జీలు, తోపులాటల మధ్య అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు కరీంనగర్‌ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బండి సంజయ్‌ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.