Mariamma Lock-Up Death Case: మరియమ్మ లాక్ అప్ డెత్ కేసు, సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన హైకోర్టు, ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు
High Court of Telangana | (Photo-ANI)

Hyd, Nov 29: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై (Mariamma Lock up Death Case) తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మరియమ్మ మృతి చెందింది.

దొంగతనం కేసులో ఇంటరాగేషన్‌ పేరుతో మరియమ్మపై స్టేషన్‌లో పోలీసులు థర్ఢ్‌ డిగ్రీ ప్రయోగించారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్‌ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. అప్పటి నుండి మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

మరియమ్మ లాకప్ డెత్ మిస్టరీ, ఆమె కుమారుడిని పరామర్శించిన తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, అడ్డగూడురులో ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు

దీనిపై వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను శాశ్వతంగా వీధుల నుండి బహిష్కరించింది.

ఓయూ క్యాంపస్‌లో వాకింగ్ చేస్తే రూ. 200 చెల్లించాల్సిందే, డిసెంబర్ నుంచి యూజర్‌ చార్జీలు వసూలు, క్యాంపస్‌లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు

తొలగించిన పోలీసుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని డ్వకేట్‌ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్టల చేత విచారణ జరిపించేలా చూడాలని కోరారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పు వెలువరించింది.

గత విచారణలో మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో సమర్థంగా దర్యాప్తు చేసే సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలున్నాయని, సీబీఐకి ఈ కేసు దర్యాప్తు అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. మానవ హక్కుల కమిషన్‌ మార్గదర్శకాలకు లోబడి దర్యాప్తు జరుగుతోందని, లాకప్‌డెత్‌కు బాధ్యులైన ఎస్సై, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు ఇతర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు, మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

లాకప్‌డెత్‌ ఘటనపై న్యాయ విచారణతో పాటు, బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత జయవింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఇదిలా ఉంటే న్యాయస్థానం ఆదేశిస్తే దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది.

మరియమ్మ గతంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ కల్యాణ్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐపై పనిభారం ఉందా అని ధర్మాసనం కల్యాణ్‌ను ప్రశ్నించగా.. ధర్మాసనం ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ సంబంధన్‌ కూడా ప్రత్యక్షంగా కోర్టు విచారణకు హాజరయ్యారు.