Hyd, july 6: రుణమాఫీ కాకపోయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన (Tummala Nageswara Rao ) మాట్లాడుతూ.. గత పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరని వ్యాఖ్యానించారు.గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని విమర్శించారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఐటీ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి, కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం
బీఆర్ఎస్ హయాంలో సరైన పద్ధతిలో రుణమాఫీ జరగలేదని... ఇప్పుడు మాత్రం తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ అంశంలో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రతిపక్ష నేతలు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు
గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పాస్ బుక్ లేకపోయినా... తెల్లకార్డు ద్వారా రుణమాఫీ చేస్తున్నామన్నారు. రుణాలు మాఫీ కాకపోయినా ఎవరికీ ఆందోళన వద్దన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. ఈ పొరపాట్లు సరిచేసి అర్హులందరినీ రుణవిముక్తుల్ని చేస్తామన్నారు. ఆగస్ట్ 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైరాలో ప్రారంభిస్తారన్నారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది’’ అని తుమ్మల వెల్లడించారు.