TS's COVID Update: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పలు జిల్లాల్లో ఒక్కటి కూడా నమోదు కాని కొత్త కేసులు, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 285,102 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,442 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.....
Hyderabad, January 15: తెలంగాణలో శనివారం నుంచి టీకా పంపిణీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీకా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు క్రమంగా తగ్గిపోతున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 19,898 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 202 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 248 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73,99,436 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 291,118కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 15, మేడ్చల్ నుంచి 10, కరీంనగర్ నుంచి 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. తొలిసారిగా రాష్ట్రంలో 7 జిల్లాల నుంచి ఒక్క కొత్త కేసు నమోదు కాకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,574కు పెరిగింది. అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 253 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 285,102 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,442 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jan 15, 2021 11:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

