COVID in TS: తెలంగాణలో కొత్తగా 226 కొవిడ్19 కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, త్వరలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా పంపిణీకి ఆరోగ్యశాఖ కసరత్తు
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 15, మేడ్చల్ నుంచి 16, కరీంనగర్ నుంచి 16 కేసుల చొప్పున నమోదయ్యాయి....
Hyderabad, January 21: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది, మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల వరకే పరిమితమైన కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అందుబాటులోకి వస్తుందని ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణీని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 31,647 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 226 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75,741,84 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,92,621కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 15, మేడ్చల్ నుంచి 16, కరీంనగర్ నుంచి 16 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

అలాగే గత 24 గంటల్లో మరో 1 కొవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,584కు పెరిగింది. అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 224 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 287,117 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,920 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jan 21, 2021 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

