TS's COVID Update: తెలంగాణలో రెండో రోజు 13,666 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా పంపిణీ, మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి, గడిచిన 24 గంటల్లో 256 కేసులు నమోదు
82 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోని 324 టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది, ఇప్పటివరకు టీకా అందుకున్న వారిలో అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు....
Hyderabad, January 19: తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు 16,750 లబ్దిదారులకు టీకా పంపిణీ చేయాలని ఆరోగ్యశాఖ ప్రణాళిక వేయగా 13,666 మంది ఆరోగ్య సిబ్బంది టీకాలు తీసుకున్నారు. 82 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోని 324 టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది, ఇప్పటివరకు టీకా అందుకున్న వారిలో అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
అయితే ఒకవైపు కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ఇంకా అలాగే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 31,486 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 256 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 472 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75,15,066 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 292,128కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 51 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 15, మేడ్చల్ నుంచి 17, కరీంనగర్ నుంచి 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

అలాగే గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,581కు పెరిగింది. అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 298 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 286,542 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,005 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jan 19, 2021 10:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

