
Hyderabad, January 13: COVID-19 నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ రాష్ట్రానికి రావడం ప్రారంభించడంతో, టీకా పంపిణీలో జారీచేయబడిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. టీకా పొందిన తర్వాత ఏవైనా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తే, ఎలా ఎదుర్కోవాలి, వెంటనే చికిత్స తదితర ఏర్పాట్లకు సంబంధించి అన్ని చర్యలను ప్రభుత్వ సీఎస్ సమీక్షిస్తున్నారు.
రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 38,192 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 331 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 571 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73,50,644 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 290,640కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 28, కరీంనగర్ నుంచి 25, రంగారెడ్డి నుంచి 21 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,571కు పెరిగింది. అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 394 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 284,611 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,458 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.