COVID in TS: తెలంగాణలో తీవ్రరూపం దాల్చిన కరోనావైరస్, ఒక్కరోజులోనే 873 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,675కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, June 22: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తుంది. రాజధాని కేంద్రంగా రోజురోజుకు వస్తున్న పాజిటివ్ కేసులతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.  గత రికార్డులను తుడిచేస్తూ సోమవారం అత్యధికంగా 873 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అతిపెద్ద సంఖ్య.  తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 8,674 కు చేరుకుంది.

ఇక హైదరాబాద్ లో మహమ్మారి వ్యాప్తి దడ పుట్టిస్తుంది. ఈరోజు నమోదైన కేసులన్నీ

గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్క ప్రాంతాల నుంచే ఉన్నాయి. సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కేసులుండగా, పక్కన రంగారెడ్డి జిల్లా నుంచి 107 కేసులు, మేడ్చల్ నుంచి 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత సంగారెడ్డి నుంచి 12 కేసులు, వరంగల్ రూరల్ 6, మంచిర్యాల 5, కామారెడ్డి 3, మెదక్ 3, అలాగే జనగాం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల నుంచి 2 చొప్పున మరియు వరంగల్ అర్బన్ నుంచి 1 చొప్పున పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

సోమవారం మరో 7 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 217 కు పెరిగింది.

Telangana's COVID19 Update:

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇదిలా ఉంటే, ఈరోజు మరో 274 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,005 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 3,189 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 60,243 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.