Hyderabad, Aug 12: ఫోన్ (Mobile) మాయలో పడి ఏం చేస్తున్నాం అన్న సంగతి కూడా కొందరు మరిచిపోతారు. ఫోన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో (Social Media) చాటింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన వాళ్లు కోకొల్లలు. ప్రస్తుతం చెప్తున్న ఘటన కూడా ఇలాంటిదే. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) కుటుంబంతో నివసిస్తున్నాడు. మహేశ్ ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆదివారం రాత్రి ఆ పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయాలనుకొన్నాడు.
ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి.. షాక్ కొట్టి మృతి
ఖమ్మం - స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయారు.
ఈలోగా ఫోన్… pic.twitter.com/M7oTpVGgcA
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2024
ఫోన్ రావడంతో..
ఇంతలో మహేశ్ మొబైల్ రింగ్ అయ్యింది. దీంతో ఒక వైపు ఫోన్ లో మాట్లాడుతున్న మహేశ్.. బకెట్ నీటిలో బదులు హీటర్ ను తన చంకలో పెట్టుకున్నాడు. తానేం చేస్తున్నానో మరిచిపోయి హీటర్ స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. దీంతో భయపడిపోయిన భార్య దుర్గాదేవి.. మహేశ్ ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.