Hyderabad, January 8: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈరోజు ఆరోగ్య శాఖ అధికారులు డ్రైరన్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో ఈ మాక్ డ్రిల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలివిడతలో ఫ్రంట్ లైన్ వారియర్లు టీకా అందుకోనున్నారు, త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీపై తేదీలు ఖరారు కానున్నాయి.
ఇక కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 38,985 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 346 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 699 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 71,84,598 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,89,135కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 34, రంగారెడ్డి నుంచి 41 కేసులు వచ్చాయి, ఇక మిగతా అన్ని జిల్లాల నుంచి 20 లోపే కేసులు నమోదయ్యాయి. ఇతర వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.