Telugu States Covid: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కోవిడ్, ఏపీలో తాజాగా 599 కేసులు నమోదు, తెలంగాణలో 596 మందికి కరోనా, కోవిడ్‌పై యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్
Coronavirus in US (Photo Credits: PTI)

Hyderabad, Dec 5: రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు (Telugu States Covid) తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 802 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,72,719కి (Covid in Telangana) చేరింది.

ఇప్పటివరకు మొత్తం 2,62,751 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,470కి (Covid Deaths) చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,498 మంది కరోనాకు (Coronavirus) చికిత్స పొందుతున్నారు. వారిలో 6,465 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో గత 24 గంటల్లో 63,406 కరోనా పరీక్షలు నిర్వహించగా 599 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 115 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 913 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,020కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 8,70,675 కాగా 8,57,233 మంది వైరస్ ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,422 మంది చికిత్స పొందుతున్నారు.

మార్చి 31 వరకు స్కూళ్లు బంద్, కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం, మహారాష్ట్ర స్కూళ్లలో కరోనా కల్లోలం, దేశంలో తాజాగా 36,652 మందికి కోవిడ్ పాజిటివ్

గత తొమ్మిది నెలలుగా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూ దీటుగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలొ తెలిపారు. ఇప్పటివరకు 1,02,29,745 పరీక్షలు చేశామని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,91,568 పరీక్షలు చేశామని, జనాభాలో 19.15 శాతం మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. కోవిడ్‌ పరీక్షల్లో దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తొలిస్ధానంలో ఉందన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే టెస్టింగ్‌ చాలా ముఖ్యమని, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ ఈ మూడింటిపైన ప్రభుత్వం అత్యంత వేగంగా వ్యవహరించిదని తెలిపారు.

కరోనా నియంత్రణ చర్యలు, ఆరోగ్య శ్రీ వైద్య సేవలు, నాడు-నేడుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ఇంతమంది కోలుకున్నారంటే ఎంత శ్రమకోర్చామో తెలుసుకోవచ్చు. ఇందుకు మన డాక్టర్లు, నర్సులు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టర్లు.. అందరికీ కృతజ్ఞతలని సీఎం అన్నారు.