Kamareddy, April 26: కరోనావైరస్ కల్లోలం వేళ మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతోంది. సాటి మనిషికి సాయం చేయాలనే భావన కూడా లోపిస్తోంది. తాజాగా కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో హృదయ విదారకమైన ఘటన (kamareddy Tragedy) చోటు చేసుకుంది. అనారోగ్యంతో నాగలక్ష్మి అనే ఓ యాచకురాలు మృతి (kamareddy dead body) చెందగా ఆమె దగ్గరకు వెళ్లడానికి కూడా చాలామంది నిరాకరించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకునే నాగలక్ష్మి అనే యాచకురాలు ఆదివారం సాయంత్రం స్టేషన్ ఆవరణలో మృతి చెందింది.
అయితే, ఆమె కరోనాతో మృతి చెంది ఉంటుందని ఎవరు మృతదేహం వద్దకు వెళ్లలేరు. కనీసం మృతదేహన్ని స్మశాన వాటికకు తరలించేందుకు ఎవరు సహకరించలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు సహాయం చేయలని మృతురాలి భర్త స్వామి స్థానికులను ప్రాధేయపడ్డాడు. అయితే ఎవరూ రాకపోవడంతో ఆటోలో తన భార్య మృతదేహన్ని తరలించాలని ఆటో డ్రైవర్లను కూడా స్వామి ప్రాధేయపడగా వారు కూడా నిరాకరించారు.
దిక్కుతోచని స్వామి భార్య మృతదేహాన్ని స్వయంగా తన భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరం (Husband carries his wife dead body three kilometers on Sholder) ఉన్న శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు. మార్గమధ్యలో మృతదేహంతో తనకు సాయం అందించాలని రోడ్డు మీద జనాలను అర్థించాడు. అయినా ఎవరూ కనికరం చూపించలేదు. ఈ ఘటన తెలుసుకున్న రైల్వే పోలీసులు, కొంత మంది స్థానికులు కలిసి 2500 రూపాయలను అంత్యక్రియల నిమిత్తం నాగలక్ష్మి భర్త స్వామికి అందజేశారు. శ్మశాన వాటికలో ఖర్చుల కోసం భార్య మృతదేహంతోనే మార్గమధ్యంలో స్వామి భిక్షాటన చేయడం గమనార్హం.
ఇదే జిల్లాలో గతంలో కూడా ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. జిల్లాలో నిర్మల్ ఈద్ గావ్‌కి చెందిన మహారాజ్ లింగ్ రాజు(44)... కామారెడ్డి రైల్వేస్టేషన్లో హామాలిగా పనిచేస్తూ... గాంధీ గంజ్ ప్రాంతంలో తలదాచుకుంటున్నాడు. దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న రాజు శచనిపోయాడు. ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు కంప్లైంట్ కాల్ చేశారు. పోలీసులు వచ్చి... మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కాస్త సాయం పట్టమని స్థానికుల్ని అడిగితే... కరోనా భయంతో ప్రజలు ముందుకు రాలేదు.
పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇప్పుడే వస్తామంటూ... అక్కడి నుంచి బయల్దేరారు. ఆ తర్వాత... రైల్వేలో అనాథ శవాల్ని సంస్కరించే యువకుడు రాజు వచ్చి... మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి... దాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా వాహనదారుల్ని సాయం కోరాడు. ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు. దాంతో చివరకు తనే తన సైకిల్‌పై ఆస్పత్రికి తరలించాడు.