TRS MLA Ramalinga Reddy Dies (Photo Credit_Facebook)

Hyderabad, August 6: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) (TRS MLA Ramalinga Reddy Dies) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఇటీవలే రామలింగారెడ్డి ( Dubbaka MLA Ramalinga Reddy) కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రైవేటు దవాఖాలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు.

ఆయన 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సోలిపేట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రామలింగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పని చేశారు. సోలిపేటకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.ఆయన భౌతిక కాయాన్ని కుటుంబీకులు సిద్ధిపేట జిల్లాలోని స్వగ్రామం చిట్టాపూర్‌కు తరలించారు. అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. సోలిపేట మృతి చెందిన వార్త తెలుసుకొని చిట్టాపూర్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వంగపండు ప్రసాదరావు కన్నుమూత, సంతాపం తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు

దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి

తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం నన్ను కలచివేసింది. వారి మృతి తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్‌ (Minister KTR) ట్వీట్‌ చేశారు.

రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు’ అంటూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Minister Harish Rao) ట్విటర్‌లో పేర్కొన్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిది. తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా ఆకాంక్షించిన వారిలో ఆయన ఒకరు. వారు జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు’ అంటూ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ (Minister Etela Rajender) సంతాపం ప్రకటించారు.

‘దుబ్బాక శాసనసభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్న..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు.

తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయింది. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి ప్రజల అభీష్టం నెరవేర్చిన మహనీయుడు’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి ప‌ట్ల రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రామలింగారెడ్డి, రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామ‌లింగారెడ్డి ప్రజా జీవితంలో చేసిన సేవలు మరువ లేనివని, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని ఇంద్ర కరణ్ రెడ్డి కొనియాడారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి మృతికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణవార్త తీవ్రదిగ్భ్రాంతి కలిగించిందన్నారు. పత్రికారంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వి, నిరాడంబరుడు, తెలంగాణ ఉద్యమకారుడని కొనియాడారు. రామలింగారెడ్డితో తనకు రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. ఆయన మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు తీరనిలోటన్నారు.

రామలింగారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శాసన సభ్యుడు, సహచర తెలంగాణ ఉద్యమకారుడు రామలింగారెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని రేవంత్ రెడ్డి తెలియజేశారు.

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు సార్లు సహచర ఎమ్యెల్యేగా పని చేసిన రామలింగారెడ్డికి ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉందన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రజా ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించిన నాయకుడన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని ఉత్తమ్, భట్టి, జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనకు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రామలింగారెడ్డి మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. రామలింగారెడ్డి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. రామలిగారెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.