High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, May 17: తెలంగాణ రాష్ట్ర కరోనా పరిస్థితులపై హైకోర్టు (TS High Court) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ (TS Lockdown) సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) అభినందించింది. లాక్‌డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీ తీసిన ఫుటేజ్‌ను హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు.

లాక్‌డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 వరకు గైడ్ లైన్స్‌ను పటిష్టంగా అమలు చేసినందుకు ముగ్గురు సీపీలకు హైకోర్టు అభినందనలు తెలిపింది. లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరుపై డీజీపీ కోర్టుకు నివేదిక సమర్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాల్ని కోర్టుకు సమర్పించారు. దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసుల పనితీరును అభినందించింది.

ఇటీవలే పాతబస్తీలో రంజాన్ రోజున హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పర్యటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్‌ను ఓల్డ్ సిటీ ప్రజలు పటిష్టంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పురానా షెహర్‌లో ప్రజలు ఎక్కడా కూడా కనిపించడం లేదన్నారు. పండగ రోజు కూడా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్న పాతబస్తీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు, 27 మంది కరోనాతో మృతి, 50,969కి చేరుకున్న యాక్టివ్‌ కేసులు, హైదరాబాద్‌కు చేరుకున్న రష్యా కరోనా టీకా స్పుత్నిక్-వి

తెలంగాణ‌లో మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ.31 కోట్లు వ‌సూలు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధ‌ల అమ్మ‌కాల‌పై 98 కేసులు నమోదు చేసినట్లు, మాస్కులు ధ‌రించ‌ని వారిపై 3,39,412 కేసుల ఫైల్‌ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. భౌతిక దూరం పాటించ‌నందుకు మొత్తం 22,560 కేసులు న‌మోదయ్యాయని డీజీపీ న్యాయస్థానానికి వివరించారు.

క‌రోనా నేప‌థ్యంలో క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని డీజీపీ చెప్పారు. బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధ‌ల అమ్మ‌కాన్ని నిరోధిస్తున్నామ‌ని, ఇప్ప‌టికి 98 కేసులు న‌మోదు చేశామ‌ని వివ‌రించారు. లాక్‌డౌన్ ప‌క‌డ్బందీ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 14 వ‌ర‌కు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల కింద మొత్తం 4,31,823 కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు.

హైదరాబాద్ వాసులకు మరో షాక్, హుస్సేన్ సాగర్, నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కరోనా జన్యు పదార్థాలు, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో పెరగడం ప్రారంభమైన జన్యు పదార్థాలు

కాగా లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్య‌క్తం చేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధులు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్‌జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని సూచించింది. ఎన్నిక‌ల విధుల్లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను క‌రోనా వారియర్లుగా గుర్తించాలని హైకోర్టు చెప్పింది.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించడంలేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల వలె తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు లేదని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. బెడ్స్‌ సామర్థ్యం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒకలా, గ్రౌండ్‌ లెవల్‌లో మరో సంఖ్య ఉందని వివరించారు. మొదటి దశలో ప్రైవేట్ ఆస్పత్రుల చార్జీలపై ఫిర్యాదులకు ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారని హైకోర్టుకు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు హైకోర్టుకు వెల్లడించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకోవడంపై హైకోర్ట్ ఆగ్రహం, తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే, ఏ రూపంలోనూ అంబులెన్సులను ఆడ్డుకోరాదని ఆదేశాలు జారీ

దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స, సిటీ స్కాన్‌, టెస్టులకు ధర నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని, కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై ముగ్గురు సభ్యుల కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా మల్లాపూర్‌లో గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గర్భిణీ మృతి ఘటనపై విచారణ చేసి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్, టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయం

ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కార్పొరేషన్లు, ఎన్జీఓలతో ఒప్పందం చేసుకుని కమ్యూనిటీ కిచన్‌లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలంది. ప్రతి జిల్లా వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ కిచన్ వివరాలు పొందుపరచాలని తెలిపింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఈఎన్‌టీ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. కమ్యూనిటీ సెంటర్లను టెస్టింగ్, ఐసోలేషన్‌ సెంటర్లుగా పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 1కి వాయిదా వేసింది.

ఎలక్షన్ డ్యూటీలో ఉండి 500 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారని... 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఎలక్షన్ డ్యూటీలో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని పేర్కొంది. వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.