Suryapet Shocker: తన మాట వినకుండా భర్త ఊరు వెళ్లాడని..పసి పిల్లలకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, సూర్యాపేట నడిగూడెంలో విషాద ఘటన, సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్‌ఐ ఎం.ఏడుకొండలు
Representational Image (Photo Credits: File Image)

Suryapet, June 28: తెలంగాణలో సూర్యాపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి (Woman kills two children) ఆపై తనూ బలవన్మరణానికి (ends life later in Suryapet) పాల్పడింది. స్థానికుల తెలిపిన కథనం ప్రకారం.. చెన్నకేశవాపురం గ్రామానికి చెందిన చింతలపాటి రాములు, పద్మల చిన్న కూతురు మౌనిక (28)కు చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన శ్రీనాథ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది.

పెళ్లి తర్వాత వీరు నడిగూడెం మండలం రామాపురంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దంపతులకు మూడేళ్ల చిన్నారి లాక్షిత (3), తొమ్మిది నెలల బాలుడు సంతానం. రామాపురంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా శ్రీనాథ్‌ పనిచేస్తున్నారు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గొడవలకు సంబంధించి సూర్యాపేటలో పంచాయతీకి రావాలని శ్రీనాథ్‌కు బంధువులు కబురు పంపారు.

తూర్పు గోదావరిలో తీవ్ర విషాదం, గోదావరి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి, మరొకరు మిస్సింగ్, గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు

ఈ నేపథ్యంలో ఊరికి వెళ్లొద్దని..: కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా, శ్రీనాథ్‌ ఆదివారం సమీప బంధువు ఊరైన రత్నవరం వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. దీంతో మౌనిక అక్కడికి వెళ్లొద్దని భర్తను వారించింది. ఒకవేళ వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయంలో దంపతుల మధ్య కొద్దిసేపు గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత వినకుండా శ్రీనాథ్‌ రత్నవరం గ్రామానికి బయలుదేరాడు. భర్త తన మాట వినకుండా రత్నవరం గ్రామానికి వెళ్లడంతో మౌనిక విచక్షణ కోల్పోయింది.

ఫస్ట్ నైట్‌ కాలేదేమో..రెండు నెలలకు తన భార్య హిజ్రా అని తెలిసింది, లబోదిబోమంటూ అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, యూపీలోని కాన్పూర్‌లో ఘటన

క్షణికావేశంలో తన ఇద్దరు చిన్నారులను తలుపు బేడానికి ఉరివేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ గది మధ్యలో ఉన్న ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీనాథ్‌ ఎంత పిలిచినా భార్య తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులను తొలగించి చూడగా మౌనిక, ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. గ్రామస్తుల సమాచారంతో ఎస్‌ఐ ఎం.ఏడుకొండలు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తల్లి క్షణికావేశంతో ముక్కుపచ్చలారని చిన్నారుల ఉసురు తీసిందని స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు.