YSR Telangana Party Founder YS Sharmila. (Photo Credits: Twitter)

Siddipet, Aug 18: సిద్దిపేట (Siddipet) జిల్లాలోని సీఎం కేసీఆర్ (CM KCR) నియోజకవర్గం గజ్వేల్ లో (Gajwel) పర్యటించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సిధ్ధమయ్యారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదన్న కారణంతో ఆమెను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tomato Price Drop: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.60కి దిగొచ్చిన టమాటా ధర... కిలో రూ.30కే లభించే తరుణం రాబోతుంది!!

Tirumala Update: శ్రీవారి భక్తులకు కర్రల పంపిణీ.. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా నడక దారిలో తగ్గిన భక్తులు (వీడియోతో)

పర్యటనకు కారణమిదే

దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామస్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితులకు మద్దతుగా నిలిచేందుకు గజ్వేల్ లో పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. దీంతో ఈరోజు పర్యటనకు సిద్ధమవ్వగా.. అనుమతిలేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.