ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రమాదకరమైన 8 యాప్స్‌ను (Google Bans 8 Dangerous Apps) ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఆ యాప్స్‌ను ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని యూజర్లను హెచ్చరించింది. టప్ మని నీటి బుడగలా పేలిపోయే బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. అయితే ఆ ఇంట్రస్ట్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అనుసరిస్తున్నారు. బిట్ కాయిన్‌పై యాప్స్ తయారు చేసి వైరస్‌ల సాయంతో యూజర్ల అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. దీంతో గూగుల్ ఆయా యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
ఇప్పటికే కేంద్రసమాచార శాఖ వందల మొబైల్ యాప్స్‌ను (Mobile Apps) బ్యాన్ చేసింది. వాటి కారణంగా దేశ సమగ్రతకు, భద్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది. ఇప్పుడు నిషేధితమైన యాప్స్‌లో చాలా వరకు చైనా యాప్సే ఉన్నాయి. వీటిలో వుయ్‌వర్క్‌చైనా, అలీఎక్స్‌ప్రెస్, క్యామ్‌కార్డ్, స్నాక్ వీడియో వంటి మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. జూన్ 29వ తేదీన 43 యాప్స్‌ను, సెప్టెంబర్ 2వ తేదీన మరో 118 యాప్స్‌ను సెక్షన్ 69ఏ చట్టం కింద కేంద్రం నిషేధించింది. అప్పుడు చైనాతో లడఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున దేశంలో చైనా యాప్స్‌పై డిజిటల్ స్ట్రైక్స్‌ను ప్రభుత్వం నిర్వహించింది.
గతంలో కూడా టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వుయ్‌చాట్, లూడో వంటి ప్రముఖ యాప్స్‌ను కేంద్రప్రభుత్వం బ్యాన్ చేసింది. భారత వినియోగదారుల డేటాను లీక్ చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారతదేశంలో మొబైల్, ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న కోట్లాది మంది వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజాగా గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్
బిట్‌ఫండ్స్- క్రిప్టో క్లౌడ్ మైనింగ్
బిట్‌కాయిన్ మైనర్- క్లౌడ్ మైనింగ్
వికీపీడియా (BTC)- పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్
క్రిప్టో హోలిక్- బిట్‌కాయిన్ క్లౌడ్ మైనింగ్
డైలీ బిట్ కాయిన్ రివార్డ్స్ - క్లౌడ్ ఆధారిత మైనింగ్ వ్యవస్థ
బిట్‌కాయిన్ 2021
మైన్‌బిట్ ప్రో - క్రిప్టో క్లౌడ్ మైనింగ్ & బిటిసి మైనర్
ఎథీరియం (ETH) - పూల్ మైనింగ్ క్లౌడ్